ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాలభీమారం బీసీ బాలుర హాస్టల్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు:

భీమారం బీసీ బాలుర హాస్టల్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు:

📰 Generate e-Paper Clip

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం,జూలై 19:
ప్రజల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యత
భీమారం మండలంలోని బీసీ బాలుర హాస్టల్‌లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భీమారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చేకుర్తి సత్యనారాయణ రెడ్డి ఆర్థిక సహకారాన్ని అందించి, భద్రత పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా భీమారం ఎస్‌ఐ శ్రీ A. రాజేందర్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో, ఆస్తుల రక్షణలో మరియు సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాలు, వ్యాపార సంస్థలు మరియు దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని, శాంతియుత భీమారం కోసం పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భీమారం మండల యువ నాయకులు కమ్మగోని సాయితేజ గౌడ్, కొత్తపోటు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!