ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ ఉత్సవాలు నిర్వహించాలి - గోర్ సేన బంజారా...

ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ ఉత్సవాలు నిర్వహించాలి – గోర్ సేన బంజారా సంస్కృతిని కాపాడాలని, తీజ్ పండగకు సెలవు ప్రకటించాలని డిమాండ్

📰 Generate e-Paper Clip

హనుమకొండ, జూలై 21,అర్జున్ సమాచారం:
గోర్ సిక్వాడి, గోర్ సేన భారత్, తెలంగాణ కమిటీల పిలుపుమేరకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షులు మాలోతు చిట్టిబాబు నాయక్ మాట్లాడుతూ.. భారత దేశంలోని దాదాపు 12 కోట్ల మంది  సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పండగను అన్ని తండాలలో, నగరాలలో ఘనంగా జరుపుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీజ్ పండగ నాడు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.
గోర్ సేన అధ్యక్షులు సభవట్ మహేందర్ నాయక్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోర్ బంజారాలు శ్రావణమాసం ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తీజ్ పండుగ అనేది సింధు నాగరికతకు ముందు నుండే బంజారాల వారసత్వ సంపదగా వస్తోందని అన్నారు. తొమ్మిది రోజులపాటు గోధుమ మొక్కలకు పెళ్లికాని యువతులు నీరు పోస్తూ, గోధుమ గడ్డి ఏపుగా పెరిగితే పంటలు కూడా అదేవిధంగా బాగా పండుతాయని నమ్ముతారని చెప్పారు. చివరి రోజున సేవాల్ మహారాజ్ కు భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించి, మేరమా యాడికి పూజలు చేస్తామన్నారు
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!