ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లపోక్సో నేరాలపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం పోక్సో నిందుతులకు వరుస కఠిన శిక్షలు ...

పోక్సో నేరాలపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం పోక్సో నిందుతులకు వరుస కఠిన శిక్షలు పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల శిక్షతో సంచలన తీర్పు జిల్లా ఎస్పీ మహేష్ బి . గితే

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల,అర్జున్ సమాచారం:
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక పై లైంగిక వేధింపుల (పోక్సో) కేసులో నిందితుడుకి 20 సంవత్సరాలు జైలు శిక్ష, 2000/- రూ. జరిమానా విధిస్తు సిరిసిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ మంగళవారం తీర్పు వెల్లడించినట్టు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు

* కేసు వివరాలు…

సిరిసిల్ల కి చెందిన బుర్లా చంద్ర శేఖర్ అనే వ్యక్తి సిరిసిల్ల కి చెందిన ఒక మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేయగా, బాలిక యొక్క తల్లి పిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్ కి తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.

* కోర్టు తీర్పు…

కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ లు రవీందర్ నాయుడు, శ్రవణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ జనార్ధన్,కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్ వాదించగా, శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలీoచిన న్యాయమూర్తి నేరము రుజువు కావడంతో నిందితుడైన బుర్లా చంద్ర శేఖర్ కి 20 సంవత్సరాలు జైలు శిక్ష,రూ. 2000 జరిమాన విధించారు. పోక్సో కేసుల్లో జిల్లా పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి, ప్రాసిక్యూషన్ సమన్వయంతో వేగవంతమైన విచారణ జరిపిస్తూ నిందితులకు వరుసగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు.నేరం చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈకేసులో పకడ్బంధిగా దర్యాప్తు జరిపి నిందితుడికి శిక్ష పడేలా కృషి చెసిన అప్పటి విచారణ అధికారి డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి , ప్రస్తుత డిఎస్పీ నాగేంద్రచారి,ప్రస్తుత సి.ఐ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్,కోర్టు మానిటరిoగ్ ఎస్.ఐ లు రవీందర్ నాయుడు,శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ జనార్దన్,కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్,పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల లను జిల్లా ఎస్పీ అభినందిచారు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!