న్యూ ఢిల్లీ ,అర్జున్ సమాచారం:
సహచర తెలంగాణ బీజేపీ ఎంపీలతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (#PMGSY) కింద తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని గ్రామీణ రహదారులను మంజూరు చేయాలని, అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (#PMAY) కింద అర్హులైన పేద కుటుంబాలకు అధిక సంఖ్యలో గృహాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదల సొంత ఇంటి కల సాకారం కోసం కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీ ఈటల తో పాటు బీజేపీ ఎంపీలు డీకే అరుణ, మాధవనేని రఘునందన్ రావు, గోడం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.
=============================
కేంద్ర మంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపిలు
RELATED ARTICLES

