ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeజాతియంఢిల్లీచెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చాలి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్...

చెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చాలి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరిన ఎంపి చామల న్యూఢిల్లీ

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
బుధవారం నాడు  న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసారు. హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసారు.
గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్కు బదులుగా ఇప్పటికే ఉన్న ఎన్హెచ్-65 (NH-65) కారిడార్ గుండా ఈ మార్గాన్ని నిర్మిస్తే, ఆ ప్రాంతంలోని పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు.
ఈ విధంగా మార్గాన్ని మళ్లించడం ద్వారా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా పూర్తి ప్రయోజనాలు చేకూరుతాయని కోరడం జరిగింది. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయనను అభ్యర్థించారు.
ఈ సమావేశంలో ఎంపి చామల  పాటు నాగర్కర్నూల్ ఎంపీ  మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ  సురేష్ షెట్కర్, పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!