ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రధాని బందోబస్తు, భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్...

ప్రధాని బందోబస్తు, భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ఆగష్టు 1న భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేసేందుకు వస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రత ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ  హరీష్ కుమార్ గుప్తా, జూలై 31న పర్యవేక్షించారు.

రాష్ట్ర డీజీపీ  హరీష్ కుమార్ గుప్తా  ఎయిర్ పోర్ట్ ఆవరణంలో నిర్మించిన  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, టెర్మినల్ బిల్డింగ్, ప్రధాని సభ నిర్వహించే ప్రాంతం,  థింసా నృత్యం నిర్వహించే ప్రాంతాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాని పర్యటనకు దాదాపు 3 వేల సీసీ కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, వాటిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ లోని ఎల్.ఈ.డి.స్క్రీన్స్ కు అనుసంధానం చేసినట్లుగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ డీజీపీకి తెలిపారు.
సీసీ కెమెరాల ఆధారంగా క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పార్కింగ్ ప్రాంతాలను, ప్రధాని సభ జరిగే ప్రాంతాలను  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించనున్నట్లుగా అధికారులు డీజీపీకి వివరించారు.

అనంతరం, టెర్మినల్ బిల్డింగ్, లోపలి ప్రాంతాలను సందర్శించి, ప్రధాని సభ జరిగే ప్రాంతాలు, థింసా నృత్యం జరిగే ప్రాంతాలకు వెళ్ళే మార్గాలను పరిశీలించారు. జిల్లా పోలీసుశాఖ చేపట్టిన భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కి వివరించారు.

బందోబస్తు, భద్రత, ట్రాఫిక్ విధులను పర్యవేక్షించే సీనియర్ పోలీసు అధికారులు తమ క్రింద పని చేసే అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పని చేయాలని అధికారులను రాష్ట్ర డీజీపీ ఆదేశించారు.

ప్రజలను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే మీటింగ్ స్థలంలోనికి అనుమతించాలన్నారు. సభ ముగిసిన తరువాత ప్రజలు సురక్షితంగా తిరిగి తమ ఇండ్లకు చేరుకునేలా పోలీసు అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టాలన్నారు. జాతీయ రహదారి మీదుగా ఎయిర్పోర్ట్ వైపు వాహనాలు వెళ్ళే మార్గంలో వాహనదారులకు సులువుగా అర్థమయ్యే విధంగా పెద్ద సైజులో సైనేజ్లను ఏర్పాటు చేసి, వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాలకు చేర్చాలని అధికారులకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ సూచించారు.

రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా వెంట శాంతిభద్రతల  అదనపు డీజీ ఎన్.మధుసూదన రెడ్డి, గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఐజి కి.శ్రీకాంత్, ఈగల్ ఐజి ఆకె రవికృష్ణ, విశాఖపట్నం రేంజ్ ఐజి గోపినాథ్ జట్టీ, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఉన్నారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!