ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణఆసిఫాబాద్మాలి కులానికి ఎస్టీ హోదా కల్పించాలి: 'మాలి సంక్షేమ సంఘం' డిమాండ్

మాలి కులానికి ఎస్టీ హోదా కల్పించాలి: ‘మాలి సంక్షేమ సంఘం’ డిమాండ్

📰 Generate e-Paper Clip

మాలి కులానికి ఎస్టీ హోదా కల్పించాలి: ‘మాలి సంక్షేమ సంఘం’ డిమాండ్

కాగజ్ నగర్(కుమురం భీమ్ ఆసిఫాబాద్), అర్జున్ సమాచారం ప్రతి నిధి, ఆగస్టు 3

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలంలోని తిలక్‌నగర్ బీసీ భవన్‌లో తెలంగాణ మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు లేండుగూరి శ్యామ్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంతరావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోర్లే మొండి, జిల్లా ప్రధాన కార్యదర్శి వడుగూరి సాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో మాలి కులానికి ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసన, ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా మాలి సంఘ సభ్యులను చైతన్యపరచడం, ప్రతి జిల్లా నుంచి అధిక సంఖ్యలో సభ్యులు ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించాలని నాయకులు సూచించారు.
అదేవిధంగా, వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచి హాజరైన ప్రతినిధులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పలు విలువైన సలహాలు, సూచనలు చేశారు. ఎస్టీ హోదా సాధన లక్ష్యంగా సంఘం సభ్యులందరూ ఐక్యంగా పనిచేయాలని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.
అలాగే రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, ప్రజా చైతన్య కార్యక్రమాలు, ఢిల్లీ నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో ఖరారు చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!