అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన
అద్దంకి, అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై 3
అద్దంకి లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. అద్దంకి పట్టణ పరిధిలో రక్షిత
మంచినీటి పథకం అమలుపై మంత్రి చర్చించారు. ఇప్పటికే రూ. 101.96 కోట్లతో పనులు అధికారులు ప్రారంభించారు. పట్టణ పరిధిలో 51 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉండేలా ట్యాంకులు నిర్మాణం, 83
కి.మీ మేర నీటి సరఫరా లైను, 15 కి.మీ మేర ఫీడర్ ఛానెల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ రోజు 12 మిలియన్ లీటర్ల పంపిణీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. రూ.
5.10 కోట్లతో పట్టణ పరిధిలోని ఊర చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం లేకుండా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు

