జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు.
జగిత్యాల, అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 10.
ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి – నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు.
బాబు బరువు: 1.8 కేజీలు
మొదటి పాప బరువు: 1.5 కేజీలు,రెండో పాప బరువు: 1.4 కేజీలు,ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి – నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

