హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు. నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని తాము కష్టపడి టీ హబ్బును నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్’ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇది ఫ్యామిలీ-రన్: ఫ్యామిలీ-డ్రైవ్ జీరో ఇన్నోవేషన్ జీరో ఎంప్లాయీస్ స్కామ్ అంటూ ఆరోపించారు. అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు.. ఎటువంటి ప్రశ్నలు లేకుండా వందల కోట్లు విలువైన భూములు దక్కించుకోవచ్చంటూ సెటైర్ విసిరారు.
డిఫెన్స్ కంపెనీ పెట్టి, రాత్రికి రాత్రే కనీసం రూ.200 కోట్ల లాభం ఆర్జించినందుకు ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాల్సిందే. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఈ అద్భుతమైన ‘బిజినెస్ మోడల్’ ఏంటో నేర్పించండి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వండి. ఈ మ్యాజిక్ ట్రిక్ కేవలం అనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం కావాలి తెలంగాణ యువత మొత్తానికి ఈ ‘అనుముల హబ్’ అవకాశాన్ని కల్పించండి అంటూ ఎక్స్‌లో కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
==========================

