ఐ ఎఫ్ టి యు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించిన కె విశ్వనాథ్ ఆరెల్లి కృష్ణ……
.. .. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 16 .
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం ఐ ఎఫ్ టి యు రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ ఎంఎల్ పార్టీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22 23 తారీకుల్లో గోదావరిఖని అడ్డగుంట సిరి ఫంక్షన్ హాల్ లో నాల్గవ మహాసభలను నిర్వహిస్తున్నామని ఆదివారం సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కే విశ్వనాథ్ ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో పర్మనెంట్ పరిశ్రమలను మూసివేతకు గురి చేస్తూ ఇప్పటికే వేలాది పరిశ్రమలను మోసేసిందని లక్షలాది మంది జీవితాలను బలి చేసిందని భారత కార్మిక వర్గాన్ని ఎట్టి బానిసలుగా కట్టు బానిసత్వంలో కూరుకు పోయేలా చేస్తూ యువతరానికి బతుకుతెరువును లేకుండా చేసి అందరి జీవితాలను ఆగం చేస్తుందని ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించిన హక్కులన్నీ ఇప్పటికే హరించి వేసిందని కార్మిక హక్కుల మార్పు పేరుతో నల్ల చట్టాలను అమలు చేయ చూస్తూ వేతన బానిసలుగా యువతరాన్ని మార్చేస్తుందని దేశంలో రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగిస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు దేశ సంపదను దారాదత్తం చేస్తుందని రామగుండం ఎన్నో రకాల పరిశ్రమలతో తులతూగేదని నేడు ఆ పరిస్థితి దారుణంగా మారి పేద ప్రజలు జీవించలేని పరిస్థితులు దాపరిచాయని ఔట్సోర్సింగ్ కాంట్రాక్టీకరణ మేకనైజేషన్ అనే చిత్రమైన పేర్లతో శ్రమజీవుల పొట్టలు కొడుతూ కార్పొరేట్ శక్తులకు పోడిగం చేస్తుందని కార్మిక హక్కుల కోసం పోరాడి ఎంతోమంది కామ్రేడ్స్ మరణించారని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కామ్రేడ్స్ కుమారస్వామి మొండన్న యు రాములు ముక్తార్ పాషా బూసిపాక రాజన్న జిన్నా అశోక్ లాంటివారు ఎందరో అమరులయ్యారని వారి త్యాగాల స్ఫూర్తితో నాలుగో మహాసభ నిర్వహిస్తున్నామని దీనికి ప్రజలు ఉద్యమ సానుభూతిపరులు వ్యాపారస్తులు తమకు చేయూతను అందించాలని కోరారు కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దాముఖ లచ్చన్న యతిరాజు శ్రీను మల్లన్న వెంకటేష్ రాజన్న నరసన్న కోషమల్లు రాజేష్ సతీష్ శ్రీనివాస్ బుధిరాం తదితరులు పాల్గొన్నారు

