ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeతెలంగాణవిద్యార్థులకు భోజన ప్లేట్లు అందించిన సర్పంచ్ వీరయ్య

విద్యార్థులకు భోజన ప్లేట్లు అందించిన సర్పంచ్ వీరయ్య

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు భోజన ప్లేట్లు అందించిన సర్పంచ్ వీరయ్య

భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్ట్ 15

ఆరేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లోని విద్యార్థులకు భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరేపల్లి గ్రామ సర్పంచ్ వీరయ్య పాఠశాల విద్యార్థులకు ఉచితంగా భోజన ప్లేట్ల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వీరయ్య మాట్లాడుతూ… స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, నేటి తరం విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని రజిత ,తోటి టీచర్ లు, మరియు తాని మల్లన్న, దుర్గం హైమవతి, ఆకుదారి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఆకుదారి దుర్గయ్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!