ఆసిఫాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆసిఫాబాద్ (కొమరం భీమ్).అర్జున్ సమాచార స్టాఫ్ రిపోర్టర్ , ఆగస్టు 15
ఆసిఫాబాద్ జిల్లాలోని పరేడ్ గ్రౌండ్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం లో ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి,
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు సంక్షేమ, సఖి, విద్యా, వైద్య, సైబర్ క్రైమ్, వ్యవసాయ, ఉద్యానవన, గృహ నిర్మాణ, వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత జిల్లా ఎస్పీ నితిక పంత్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, నాయకులు ప్రభుత్వ సిబ్బంది, ప్రజా నాయకులు , జిల్లా ప్రజలు పాల్గొన్నారు.

