ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి,నలుగురు వ్యక్తులు అదుపులోకి.. రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్...

ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి,నలుగురు వ్యక్తులు అదుపులోకి.. రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం.

📰 Generate e-Paper Clip

ఓడేడు శివారులో జూద స్థావరంపై పోలీసుల దాడి,నలుగురు వ్యక్తులు అదుపులోకి.. రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం.

అర్జున్ సమాచారం | ఆగస్టు 15 | ముత్తారం రిపోర్టర్.

ముత్తారం, ఆగస్టు 14: ముత్తారం మండలం ఓడేడు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపల్లి గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి మూడు కార్డులతో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం అందడంతో ఎస్‌ఐ, పీసీలు 1092, 1466లతో కలిసి ముత్తారం పోలీస్ స్టేషన్ నుంచి వెంకటేశ్వరపల్లి గ్రామ శివారుకు వెళ్లారు. సుమారు సాయంత్రం 4:30 గంటలకు జూదం ఆడుతున్న స్థావరంపై దాడి చేయగా, నలుగురు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి మూడు కార్డులతో జూదం ఆడుతూ పట్టుబడ్డారు.

వారిని అదుపులోకి తీసుకుని ఇద్దరు పంచ సాక్షుల సమక్షంలో విచారించగా తమ వివరాలను వెల్లడించారు. వారు ఓడేడు గ్రామానికి చెందిన కందుల రాజు (48), సముద్రాల మల్లయ్య (65), దేవునూరి సదయ్య (42), తోట ప్రదీప్ (25)గా పోలీసులు గుర్తించారు.

విచారణలో నిందితులు వెంకటేశ్వరపల్లి గ్రామం, ఓడేడు గ్రామ శివారులో అందరూ కలిసి డబ్బులు పందెంగా పెట్టి మూడు కార్డులతో జూదం ఆడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

వారి ఒప్పుకోలు వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు పంచ సాక్షుల సమక్షంలో కన్ఫెషన్ కమ్ సీజర్ పంచనామా ద్వారా మూడు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్, రూ.3,030 నగదు, 52 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!