అర్జున్ సమాచారం:
నెక్నంపూర్లోని ఇబ్రహీంబాగ్ చెరువుతో పాటు నానక్ రాంగూడ లోని భగీరథమ్మ చెరువు, తౌతానికుంట చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
చెరువుల అభివృద్ధితో పాటే వరద కట్టడికి ఇన్లెట్లు, ఔట్లెట్లు నిర్మాణం శాస్త్రీయంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
STP la నిర్మాణం కూడా చెరువుల అభివృద్ధినాటికి పూర్తి కావాలని హైడ్రా కమిషనర్ చెప్పారు.
* పూడికను పూర్తి స్థాయిలో తొలగించడమే కాకుండా గతంలోకంటే ఎక్కువ వరద నీరు నిలిచేలా అభివృద్ధి చేయాలన్నారు.
* అనంతరం గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బయోడైవర్సిటీ, మల్కం చెరువు పరిసరాల్లో గతంలో వరద ముంచెత్తే ప్రాంతాలను పరిశీలించారు.
అక్కడ box డ్రైన్ల నిర్మాణ పనులను cmc, ghmc, MMC అధికారులతో కలసి పరిశీలించారు.
* ఖజాగుడ, మల్కం చెరువు వద్ద ఇన్లేట్లలో పూడిక తీయడంతో పాటు box డ్రైన్లను సిద్ధం చేయడంతో వరద ముప్పు తప్పిందని హైడ్రా DFO గౌతం గారు, SFO దత్తు గారు కమిషనర్లు వివరించారు.
* HCU వద్ద యూనివర్సిటీలోంచి వచ్చే వరద సాఫీగా రోడ్డు దాటించేందుకు వేసిన పైపులైన్లు పరిశీలించారు.
HCU రోడ్డు లో వరద నీరు నిలవకుండా పోచమ్మకుంటకు చేరేలా వరద కాలువ నిర్మాణ పనులు పూర్తి అవ్వడంతో ఈ ఏడాది ఇబ్బందులు తలెవత్తవని అన్నారు.
* నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ అక్కడి రైతులతో కలసి ప్రారంభించారు.
స్థానికులు కూడా పెద్దఎత్తున పూజ కార్యక్రమంలో పాల్గొని చెరువు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యమయ్యారు.
==============================

