ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeతెలంగాణఫొటోగ్రాఫర్ కొఠారి శ్రీనివాస్‌కు రెండు అవార్డులు,బెస్ట్ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ వీడియోగ్రఫీ అవార్డులతో జాతీయ స్థాయిలో...

ఫొటోగ్రాఫర్ కొఠారి శ్రీనివాస్‌కు రెండు అవార్డులు,బెస్ట్ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ వీడియోగ్రఫీ అవార్డులతో జాతీయ స్థాయిలో గుర్తింపు

📰 Generate e-Paper Clip

ఫొటోగ్రాఫర్ కొఠారి శ్రీనివాస్‌కు రెండు అవార్డులు,బెస్ట్ ఏఐ ఎడిటర్, వెడ్డింగ్ వీడియోగ్రఫీ అవార్డులతో జాతీయ స్థాయిలో గుర్తింపు.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 6 // మంథని రిపోర్టర్.

ఫొటోగ్రఫీ రంగంలో తనదైన ప్రతిభతో పాటు ఏఐ ఎడిటర్‌గా సేవలందిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమనపల్లికి చెందిన కొఠారి శ్రీనివాస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షో సందర్భంగా జరిగిన భారత్ కళా పురస్కార్-2026 వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఏఐ ఎడిటర్ పోటీల్లో శ్రీనివాస్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు బెస్ట్ ఏఐ ఎడిటర్ అండ్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు, అలాగే భారత్ కళా పురస్కార్-2026 అవార్డులను ట్రేడ్ షో నిర్వాహకులు, ఫొటోగ్రఫీ రంగ ప్రముఖులు, సినీ నటుల చేతుల మీదుగా అందజేశారు.

ప్రతిభకు దక్కిన గుర్తింపు,

ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీతో పాటు ఏఐ ఎడిటింగ్‌లో శ్రీనివాస్ చూపుతున్న ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ఆయనను రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ వెడ్డింగ్ వీడియోగ్రఫీ, ఏఐ ఎడిటర్ అవార్డులు అందుకోవడం ఎంతో ప్రత్యేకమైన విషయమని శ్రీనివాస్ తెలిపారు.

తన ప్రతిభను గుర్తించి పురస్కారాలతో సత్కరించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన ఫొటోగ్రఫీ ప్రయాణంలో ప్రోత్సాహం, సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎం.సి. శేఖర్, ట్రేడ్ షో నిర్వాహకులు ఎడిట్ పాయింట్ రమేష్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, తెలంగాణ మాజీ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సినీ నటులు తదితరులతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!