కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్ అన్నారు.
ఈ మేరకు శ్రీ ఆదిపర్హా స్వామి ప్రాంగణంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఈనెల 23 నుండి 26వ తేదీ వరకు కమాన్ పూర్ మండల కేంద్రంలో జరిగే స్వామివారి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు శీను బాబు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వీరితో పాటు ప్రభుత్వ విప్ విజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ సిపి అంబర్ కిషోర్జా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా డిసిపి రామ్ రెడ్డి అదనపు కలెక్టర్ శ్రీరాములు, మంథని ఆర్డిఓ సురేష్ గోదావరిఖని ఏసిపి మడత రమేష్, సింగరేణి జిఎంలు సుంకరి మధుసూదన్ ఆర్ జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆది 2 జిఎం లక్ష్మిపతి గౌడ్ అలాగే ఎన్టీపీసీ జిఎం లకు ఆహ్వాన పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు , వీరితోపాటు స్థానిక తహసిల్దార్ ముస్త్యాల వాసంతికి ఎంపీడీవో సాదినేని ప్రియాంకకు ఎంపీడీసీఎల్ కి
డి ఈ ప్రభాకర్క ఏ డి ఈ వెంకటనారాయణ కి మండల సర్పంచులకు మరియు వివిధ పార్టీల నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రాలు అందజేయడం జరిగింది అని తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై దీని విజయవంతం చేయాలని మా పాలకవర్గం తరఫున కోరుచున్నాము అని అన్నారు.
అలాగే స్వామివారి విశిష్టతను ప్రముఖ పూజారి రామానుజన్ తెలియజేశారు.
ఈనెల 23న ఆదివారం విష్ణు సహస్రనామ పారాయణం అంకురార్పణ రక్షాబంధనం నృత్యం గ్రహణం, 24న విద్యాభిషేకం గోపూజ ఆదివారహవనము 25న నిత్యాభిషేకం శ్రీ ఆదివార స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 26న 108 కలశములతో అభిషేకం నిర్వహించబడునని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ఆదిమర స్వామి ప్రాంగణంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ దామోదర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తీగల రాజయ్య గౌడ్ ,పిల్లి రాజు ,మల్యాల మల్లేష్ ,బూస శ్రీనివాస్ ,కొంత శ్రీనివాస్ ,చాట్ల రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు. అలాగే కరపత్రాన్ని ఆవిష్కరించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న రోడ్డుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 90 లక్షల రూపాయలు మంజూరు చేయించి పూర్తి చేయించడం జరిగింది. వారికి మా పాలకవర్గాలకు తరపున ధన్యవాదాలు అని చైర్మన్ అన్నారు.
==============================

