ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్మా సంక్షేమ ఆలోచనలో మానవీయత వుంది ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉంది సీఎం రేవంత్...

మా సంక్షేమ ఆలోచనలో మానవీయత వుంది ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉంది సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డిరు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశాన్నిచ్చారు. దేశ స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ముఖ్యమంత్రి మాట్లాడుతూ గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రెండున్నరేండ్లలో ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది.   ఇక ముందు కూడా భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం” అని పిలుపునిచ్చారు.
నిరుపేదల ఆర్థిక పురోగతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఒక స్పష్టమైన దార్శనికతతో విధ్వంసమైన తెలంగాణను పకడ్బంధీ ప్రణాళికలతో వికాసంవైపు నడిపించడానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి   తన సందేశంలో సమగ్రంగా వివరించారు.  “గడిచిన 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో నాలుగు కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేసింది. సాధించిన విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్-2047.  ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26లో మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటిచెప్పే గొప్ప విజయం ఇదని అన్నారు.
మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో, ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది. పేదవాడి పట్ల బాధ్యత ఉంది. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది. వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం ఉంది. ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం ఉంది. ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం ఉంది.  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను దాటేసింది. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.  కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడేది లేదు. అటు తుమ్మడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.
పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నాం. తొలి దశలో4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నాం.  పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజా ప్రభుత్వం ఆమోదించింది. సుమారు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కల్పించాం. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమల్లోకి తెచ్చాం.  విద్యారంగంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని అన్నారు.
ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. గోషామహల్లో రెండువేల పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాం. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం. 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. 8 మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలను నిర్మిస్తున్నాం. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించాం.  డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నాం. డ్రగ్స్ ముప్ప్పు, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. టీజీ సేఫ్ ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నాం. ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రజా ప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం నుంచి సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు… పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాల్లో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం కీలకమని అన్నారు.
తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోంది. అందుకే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ మొదలు పెట్టాం. ప్రజా పాలనలో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగింది.  బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్గా నిలవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెబుతాం.  ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళుతోంది. 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయి. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయి. హైదరాబాద్లో ఇప్పుడు 355కి పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. 2026లో కొత్తగా 40 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయని వెల్లడించారు.
డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించింది. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్వెల్లి ప్రాంతాల్లో దేశంలోని అతిపెద్ద హైపర్స్కేల్, ఏఐ-రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటోంది.  భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. మూసీ పరీవాహకన ప్రాంత ప్రజలు పెద్దమనసులో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి నష్టం, కష్టం రానివ్వమని అన్నారు.
ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. దైవం ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు తోడైతే మరిన్ని విజయాలు సాధిస్తాం..” అని ముఖ్యమంత్రి  సవివరమైన సందేశమిచ్చారు.
====================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!