ఆర్జీ-3 జీఎంను కలిసిన రాజాపూర్ గ్రామస్థులుప్రతి ఇంటికీ నష్టపరిహారం చెల్లించాలి.. ఆర్‌టీహెచ్‌ఆర్‌పీగా విభజించకుండా అందరికీ సమాన న్యాయం చేయాలి.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 17:
రామగిరి మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్థులు సోమవారం ఆర్జీ-3 జీఎంను కలిసి తమ సమస్యలను వివరించారు. ఇదివరకు నష్టపోయిన గ్రామాలకు ఎలాంటి నష్టపరిహారం అందించారో అదే విధంగా రాజాపూర్ గ్రామానికి కూడా న్యాయం చేయాలని మొదటి డిమాండ్‌గా కోరారు. ఆర్‌టీహెచ్‌ఆర్‌పీ అంటూ గ్రామస్థులను విభజించకుండా ఒకే నంబర్ కేటాయించి, అందరికీ ఒకే విధమైన న్యాయం జరిగేలా ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజాపూర్ గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే క్వారీని ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకుంటామని గ్రామస్థులు హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

