ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్పశువులను ఇంట్లోనే కట్టేయాలి-రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..క్యాతనపల్లి కమిషనర్ మురళీకృష్ణ,ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్,చైర్మన్ సంధ్యారాణి.

పశువులను ఇంట్లోనే కట్టేయాలి-రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..క్యాతనపల్లి కమిషనర్ మురళీకృష్ణ,ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్,చైర్మన్ సంధ్యారాణి.

📰 Generate e-Paper Clip

పశువులను ఇంట్లోనే కట్టేయాలి-రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..క్యాతనపల్లి కమిషనర్ మురళీకృష్ణ,ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్,చైర్మన్ సంధ్యారాణి.

అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 19,

మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి అలాగే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాష్ట్ర,జాతీయ రహదారులు ఇంకా ముఖ్యమైన రహదారులపై ఆవులు,గేదేలు,మూగపశువులు అసలు సంచరించకుండా ఆ పశువుల యాజమానులు వెంటనే వాళ్ళ ఇంట్లోని ఆవరణలో కట్టివేయాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్,మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..పట్టణ పరిధిలోని గద్దె రాగడిలో గల అమ్మ గార్డెన్స్ కమాన్ ముందు మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో దానికి సంబంధించిన వివరాలు ప్రకటించారు.ఆ ప్రధాన రహదారులపై మూగపశువులు సంచరిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు జరగడమే కాకుండా చాలామంది ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయిన రోజులు అనేకంగా ఉన్నాయని గుర్తు చేశారు.ఆ నేపథ్యంలోనే వెంటనే పశువుల యాజమానులు మేల్కొనాలని ఇకపై రోడ్లపైకి బర్రెలు,గేదెలు,ఆవులు అసలు రాకుండా జాగ్రత్త పడాలని వాళ్ల యొక్క సొంత ఇంట్లోనే కట్టివేయాలని ఆ విధంగా పునరావృతమైతే మాత్రం చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అంతేకాకుండా ప్రధాన రహదారులపై ఎట్టి పరిస్థితులలో వాహన చోదకులు బైకులు,కార్లు ఇతర వాహనాలు అసలు పార్కింగ్ చేయకూడదని-నిల్పకూడదని గుర్తు చేశారు.ఆ విధంగా చేస్తే..కూడా జరిమానాలు విధించడంతో పాటు మున్సిపల్ చట్టం అలాగే పోలీసు చట్టాలు ప్రకారం కేసులు నమోదు చేస్తామని గుర్తు చేశారు.ఆ రోడ్డులపై చిరు దుకాణాలు కూడా ఎవరు పెట్టవద్దని తెలిపారు.అంతేకాకుండా దుకాణాల యాజమానులు సీసీ కెమెరాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పై విషయాలను ఎవరైనా ఉల్లంఘించిన లేదా నిర్లక్ష్యం చేసిన లేదా తప్పుదారి పట్టించిన ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని తెలిపారు.ఇకనైనా అందరూ మేల్కొని సంబంధిత మున్సిపల్,పోలీసు అధికారులకు సహకరించాలని కోరారు.ఆ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు,మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!