ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణఆసిఫాబాద్మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలి,

మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలి,

📰 Generate e-Paper Clip

మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలి,

అర్జున్ సమాచారం కొమరం భీo జిల్లా ప్రతినిధి, ఆగస్టు 18.

కాగజ్‌నగర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాలి సంఘం మెమోరాండo

కాగజ్‌నగర్: జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కాగజ్‌నగర్ పట్టణంలో పర్యటించిన సందర్భంగా మాలి సంఘం నాయకులు, పూలే సేవా సమితి సభ్యులు మంత్రిని కలిసి మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని కోరుతూ మెమోరాండం అందజేశారు.

మాలి కులస్తుల సామాజిక, ఆర్థిక, విద్యా వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్టీ హోదా కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వారు మంత్రిని కోరారు. మాలి సమాజానికి న్యాయం జరిగేలా తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లేండుగురే శ్యాంరావు మాట్లాడుతూ, మాలి సమాజానికి ఎస్టీ హోదా కల్పించే వరకు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు, పూలే సేవా సమితి సభ్యులు, మాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!