ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణఖమ్మంగురుకుల పాఠశాలలో జూనియర్లపై సీనియర్ల దాడి ఖమ్మం

గురుకుల పాఠశాలలో జూనియర్లపై సీనియర్ల దాడి ఖమ్మం

📰 Generate e-Paper Clip

ఖమ్మం,అర్జున్ సమాచారం:
కారేపల్లి మండలం గాంధీనగర్లోని గిరిజన బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్దులు జూనియర్లపై దాడికి దిగారు. దాంతో బాధిత విద్యార్దులు
భయంతో సమీపంలోని రైల్వే స్టేషన్కు వెళ్లి దాక్కున్నారు. దాడి చేసిన విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోయారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిబ్బంది ఆటల పోటీలు నిర్వహించారు. అందులో కబడ్డీ ఆటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై పదో తరగతి విద్యార్థులు విజయం సాధించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఓటమి తట్టుకోలేక, పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేసారు. పదో తరగతి విద్యార్థులు భయంతో సమీపంలోని రైల్వే స్టేషన్లో దాక్కోగా, దాడికి పాల్పడిన 50 మంది విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్టు  సిబ్బంది వెల్లడించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు విషయం తెలుసుకుని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!