సింగరేణిలో నెలకొన్న సమస్యలు సత్వరం పరిష్కరించాలని మల్లు భట్టి విక్రమార్కకు వినతి….
. … .. అర్జున్ సమాచారం. సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 18 .
సింగరేణి సంస్థలో పేరుకుపోయిన సమస్యలను ప్రత్యేక చొరవ తీసుకొని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి గనుల శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ను కలిసి సింగరేణి లో పేరుకుపోయిన సమస్యలన్నింటిని నివేదించినట్లు తెలంగాణ కనీస వేతనాల బోర్డు చైర్మన్ ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రాన్ని అందజేసినట్లు పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి నట్లు జనక్ ప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా సంస్థలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలను సమగ్రంగా చర్చించినట్లు సింగరేణి ని పరిరక్షిస్తూ కార్మికుల మనుగడ కోసం సంస్థ పురోగతి కోసం నూతన బొగ్గు గనులను త్వరితగతిన ప్రారంభించి మెడికల్ బోర్డు సమస్య మారు పేర్లతో ఇబ్బంది పడుతున్న కార్మిక కుటుంబాల స్థితిగతులు పెర్క్స్ అలవెన్స్లపై ఇన్ కాంటాక్ట్స్ మాపి సొంత ఇంటి కల సహకారం ఈ సంవత్సరం సాధించిన లాభాల వాటా అధికారులకు సంబంధించిన (పి ఆర్ పి) విషయం యాజమాన్యంతో చర్చించేందుకు ఇండస్ట్రియల్ రిలేషన్ కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి చొరవ చూపాల్సిందిగా కార్మిక సంఘాల గుర్తింపు కాలపరిమితి ముగియడంతో ఇచ్చిన హామీలను కార్మికుల సంక్షేమాన్ని పరిష్కరించాలని ఆయనకు నివేదించినట్టు తెలిపారు సమావేశంలో కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి ధర్మపురి త్యాగరాజన్ కాంపల్లి సమ్మయ్య చీఫ్ కార్యనిర్వాక కార్యదర్శి నరేందర్ ప్రధాన కార్యదర్శి వికాస్ కుమార్ యాదవ్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి దాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

