ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణకులగణనపై మీ చిత్తశుద్ధి ఏది మోదీ సార్? శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం...

కులగణనపై మీ చిత్తశుద్ధి ఏది మోదీ సార్? శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్.

📰 Generate e-Paper Clip

కులగణనపై మీ చిత్తశుద్ధి ఏది మోదీ సార్? శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్.

అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 18.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది అనంతరం నిర్వహించిన సమావేశంలో ,బీసీ సమాజ్.
రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా మెజారిటీగా ఉన్న బీసీ వర్గాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించాలని.
కులగణన ద్వారా దేశంలోని వివిధ సామాజిక వర్గాల వాస్తవ జనాభా, వారి సామాజిక–ఆర్థిక పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, ఆ గణాంకాల ఆధారంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల్లో బీసీలకు న్యాయమైన వాటా కల్పించేందుకు ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు
2011లో నిర్వహించిన సామాజిక–ఆర్థిక కుల సర్వే (SECC)లో కుల వివరాల నమోదుకు ఓపెన్ విధానం కారణంగా అనేక ఉపకులాలు, ఇంటిపేర్లు, ప్రాంతీయ పేర్లు వేర్వేరుగా నమోదైన సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. అలాంటి లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా 2027 జనగణనలో కులాల నమోదుకు శాస్త్రీయమైన, ప్రామాణికమైన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు కోడ్ లేదా యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయించి, ఒకే కులానికి ఉన్న వివిధ పేర్లు, మారుపేర్లు, ఉపపేర్లను శాస్త్రీయంగా ఒకే కేటగిరీలోకి తీసుకురావాలని నరెడ్ల శ్రీనివాస్ సూచించారు. అప్పుడు మాత్రమే భవిష్యత్‌లో కోర్టులు, ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు విశ్వసించగలిగే ప్రామాణిక గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కుల సర్వేలలో కులాలకు కోడ్ నంబర్లు కేటాయించి సమాచారం సేకరించిన విధానం దేశానికి ఒక నమూనాగా నిలిచిందని, అలాంటి శాస్త్రీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు.
కులగణనపై కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యతిరేక వైఖరి అవలంబించినప్పటికీ, దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు, సామాజికవేత్తలు, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో కులగణన చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ విషయమేనన్నారు. అయితే కులగణన నిర్వహించడం మాత్రమే కాకుండా, అది తప్పులులేని విధంగా, శాస్త్రీయ పద్ధతిలో జరగడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
,బీసీలకు న్యాయం చేయాలంటే కులగణన ప్రామాణికంగా ఉండాలి
దేశంలో బీసీల జనాభా ఎంత? వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ వనరులు, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో వారికి ఎంత వాటా లభిస్తోంది? అనే ప్రశ్నలకు సరైన సమాధానం రావాలంటే కులగణన గణాంకాలు ఖచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు.
కేవలం ఓపెన్ కాలమ్‌లో వ్యక్తులు తమ కులాన్ని చెప్పే విధానంతో గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు కులాల జాబితా, కోడింగ్ విధానం, మారుపేర్ల సమీకరణ వంటి శాస్త్రీయ విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
“వందేళ్ల తర్వాత దేశంలో కులగణనకు అవకాశం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్న ఈ కులగణన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చారిత్రక పత్రంగా నిలవాలి. తప్పులున్న గణాంకాలు కాకుండా, కోర్టులు మరియు ప్రభుత్వాలు గుర్తించగలిగే ప్రామాణిక గణాంకాలు అందించాలి” అని నరెడ్ల శ్రీనివాస్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ సంఘాలు, సామాజికవేత్తలు, నిపుణులతో చర్చించి కులగణనలో అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ప్రతి కులానికి శాస్త్రీయంగా కోడ్ కేటాయించి, ఒకే కులానికి ఉన్న అన్ని మారుపేర్లను సమీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీలకు జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం, హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ఖచ్చితమైన కులగణన గణాంకాలు పునాదిగా మారాలని, బీసీల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం ఇకనైనా గౌరవించాలని బీసీ సమాజ్ తరఫున నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో

బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మణ్. సీనియర్ నాయకులు రంగు రాజేశం. బీసీ సమాజ్ నాయకులు ఎండి లతీఫ్. గుండ్ల లక్ష్మణ్. మెంతాల సంతోష్. గందె శ్రీ తిరుపతి. ఎండి షఫీ. పల్లపు శ్రీనివాస్. మదపల్లి రమేష్. బండి రాజేందర్. శ్రీనివాస్ గౌడ్,చంద్రగిరిచంద్రమౌళి,చిలువుల రవి, చిన్న మహేష్, శ్రీరాముల సతీష్, తదితరులు పాల్గొన్నారు✊

ఇట్లు
నరెడ్ల శ్రీనివాస్
రాష్ట్ర కార్యదర్శి – బీసీ సమాజ్

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!