ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణగౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి పర్యటన రేపు(తేది:19-08-26) కార్యక్రమం వివరాల

గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి పర్యటన రేపు(తేది:19-08-26) కార్యక్రమం వివరాల

📰 Generate e-Paper Clip

👉 అర్జున్ సమాచారం (ప్రతినిధి తెలంగాణ )ఆగస్టు 18,

రేపు ఉదయం 10:30 నిమిషాలకు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి 12:00 పబ్లిక్ మీటింగ్ లో గౌరవ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు మరియు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి & వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లు పాల్గొననున్నారు

👉 రేపు మధ్యాహ్నం 2 గంటలకు మంథనిలోని గంగాపురి వద్ద NAC స్కిల్ డెవలప్మెంట్ బిల్లింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారితో కలిసి పాల్గొననున్నారు.

👉రేపు మధ్యాహ్నం పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద 2-20 గంటలకు నాలుగు మండలాలకు సంబంధించి 9 గ్రామాలకు (మైదుపల్లి, ఎక్లాస్ పూర్, గుంజపడుగు, అడవి సోమన్ పల్లి, కేశనపల్లి, మచ్చుపేట, సుందిళ్ళ, కమాన్ పూర్, రాణాపూర్) సి ఎస్ ఆర్ (CSR) క్రింద 9 వైకుంఠ రథాలను మంథని పెట్రోల్ బంక్ వద్ద 9 గ్రామాల సర్పంచ్ లు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేయనున్నారు.

👉రేపు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు మంథని బస్ డిపో వద్ద 164 కోట్ల 64 లక్షల కు సంబంధించిన పలు రోడ్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన,

▶️మంథని టౌన్ లో బ్రిడ్జి రోడ్ నుండి బస్ డిపో వరకు వెడల్పు డ్రైన్ నిర్మాణానికి గాను – 15 కోట్లు, సెంట్రల్ లైటింగ్ కు కోటి 20 లక్షలు, గాంధీచౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ 59 లక్షలు, అంబేద్కర్ చౌక్ నుండి ముత్యాలమ్మ టెంపుల్ వరకు రోడ్డు వెడల్పు 35 లక్షలు, క్యాంప్ ఆఫీస్ రోడ్డు 50 లక్షలు మరియు ఇతర అన్ని వార్డులలో 9 కోట్లతో టౌన్ లో రోడ్లు శంకుస్థాపన.

▶️మంథని డిపో నుండి డిగ్రీ కాలేజ్ వరకు 21 కోట్లు (CRF Fund) నిధులతో శంకుస్థాపన.

▶️మంథని డిపో నుండి గోదావరి వరకు 4 లైన్ రోడ్డు 2 కిలోమీటర్లు వెడల్పు 22 కోట్లు నిధులతో శంకుస్థాపన.

▶️సూరయ్య పల్లె నుండి వయా కాకర్ల పల్లె మీదుగా సీతంపేట వరకు రోడ్డు వెడల్పు 10.8 km 29 కోట్ల 94 లక్షలు నిధులతో శంకుస్థాపన.

▶️గుంజపడుగు నుండి వయా ఉప్పట్ల మీదుగా విలోచవరం వరకు 10.9 KM రోడ్డు 8 కోట్ల 78 లక్షలు నిధులతో శంకుస్థాపన.

▶️కూనారం టు ముత్తారం రోడ్డు 18 కిలోమీటర్లు రోడ్డు 36 కోట్ల 28 లక్షలు నిధులతో శంకుస్థాపన.

👉 రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో పలు అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి మరియు నాలుగు మండలాల రేషన్ (స్మార్ట్) కార్డు పంపిణీ, కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, మైనార్టీ కుట్టుమిషన్లు, మహిళ స్వశక్తి సంఘాలకు చెక్కుల పంపిణీ సంబంధించిన పబ్లిక్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

👉రేపు మధ్యాహ్నం 4-30 నిమిషాలకు రామగుండంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

A Chandra Shekhar
PA
( Minister IT& Industries)

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!