ePaper
Friday, August 21, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు రాయచోటి

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు రాయచోటి

📰 Generate e-Paper Clip

రాయచోటి,అర్జున్ సమాచారం:

తల్లిదండ్రులుమందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని రాయచోటి అర్బన్ పోలీసులు సకాలంలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో గంగమ్మ ఆలయం సమీపంలోనివాసముంటున్న జయరాములు తన కుమారుడు లోకేష్‌ను మందలించడంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాయచోటి అర్బన్ పోలీసులనుఆశ్రయించారు.
అర్బన్ సీఐ వెంకట చలపతి ఆదేశాల మేరకు ఎస్‌ఐ చండ్రాయుడు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ బాలుడి కదలికలను గుర్తించారు. చివరకు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో బాలుడు ఉన్నట్లు గుర్తించి, ఎస్‌ఐ చండ్రాయుడు సమక్షంలో అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులకు పిల్లలను మనసు గాయపడేలా మందలించకుండా, వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రేమగా మాట్లాడాలని సూచించారు. బాలుడిని సకాలంలో గుర్తించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని సీఐ వెంకట చలపతి అభినందించారు.బాలుడిని త్వరగా గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకుఅప్పగించడంతో రాయచోటి అర్బన్ పోలీసులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!