ePaper
Monday, August 24, 2026
ePaper
Homeతెలంగాణఅట్టహాసంగా ప్రారంభమైన.(ఐ. ఎఫ్ టి.యు) 4 వ మహాసభలు.

అట్టహాసంగా ప్రారంభమైన.(ఐ. ఎఫ్ టి.యు) 4 వ మహాసభలు.

📰 Generate e-Paper Clip

*అట్టహాసంగా ప్రారంభమైన.(ఐ. ఎఫ్ టి.యు) 4 వ మహాసభలు.

  సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధిఅర్జున్ సమాచారం. ఆగస్టు 2

పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో సిరి ఫంక్షన్ హాల్ లో ఐ ఎఫ్ టి యు నాల్గవ మహాసభలు ఆదివారం మొదటిరోజు ప్రారంభమయ్యాయి సభ ప్రారంభానికి ముందు సుత్తి కొడవలి గుర్తులతో ఎర్రజెండాను రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విశ్వనాథ్ ఆవిష్కరించారు అనంతరం.ర్యాలీ ప్రదర్శన జరిపారు ఈ మహాసభలకు ముఖ్య వక్తలుగా ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షులు ఆరేల్లి కృష్ణ బి భాస్కర్ ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తో పాటు సంఘం జాతీయ నాయకులు రామకృష్ణ సరళలు పి ఓ డబ్ల్యు నాయకురాలు పాల్గొని సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వం మోడీ షా లు ఆధ్వర్యంలో తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలైన లేబర్ కోడ్ లను అమలు చేస్తూ ఎన్నో పరిశ్రమలను ప్రైవేటేగిస్తూ పెట్టుబడిదారి వర్గాలైన కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు సూచించిన చట్టాలను కూడా అమలు చేయకుండా కనీస వేతనాలను వర్తింప చేయకుండా శ్రమజీవుల పట్ల పాలకుల అక్రోసాన్ని ప్రదర్శిస్తున్నారని రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలకు పెసరు పెడుతూ విద్యావంతులైన ఎంతోమంది యువకులను ఉపాధికి దూరం చేస్తూ వికృత చేష్టలను పాలకవర్గాలు అవలంబిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా మారి జరుగుతున్న పరిణామాలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని ఈ పరిస్థితుల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడి కొత్త ఉద్యోగాలు రాక చదువుకున్న యువత దేశంలో అలమటిస్తున్నారని బిజెపి ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది పరిశ్రమలను మూసివేతకు గురిచేసి ఎంతోమంది ఉపాధి పొందే శ్రమజీవులను ఆగం చేసిందని కేవలం అదానీ అంబానీల తో పాటు బడా పెట్టుబడిదారులకు బొగ్గు గనులను కూడా కేటాయిస్తూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని సుప్రీంకోర్టు సూచనలను కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాలలో 12 గంటల పని విధానం అమలవుతుందని దశాబ్దానికి పైబడి కేంద్రంలో అధికారం కొనసాగిస్తున్న మతోన్మాదం బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని వీటన్నింటిని అధిగమించాలంటే అన్ని వర్గాల శ్రమజీవులు ఏకమై కనీస హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వెలిబుచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో వరదయ్య విజయ్ సురేందర్ లచ్చన్న భీమన్న తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!