గనుల శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్ :అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 27
మైన్స్ ఏడీ జయరాజ్ ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. భూపాలపల్లి మైన్స్ ఏడీ బొజ్జ జయరాజ్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు సహా 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జయరాజ్కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

