ePaper
Friday, August 28, 2026
ePaper
Homeతెలంగాణఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి TGEJACమంచిర్యాలకమిటి, ఆధ్వర్యంలో IDOC నస్పూర్ వద్ద...

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి TGEJACమంచిర్యాలకమిటి, ఆధ్వర్యంలో IDOC నస్పూర్ వద్ద మహా ధర్నా.

📰 Generate e-Paper Clip

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి TGEJACమంచిర్యాలకమిటి, ఆధ్వర్యంలో IDOC నస్పూర్ వద్ద మహా ధర్నా.

అర్జున్ సమాచారం ప్రతినిధి మంచిర్యాల ఆగస్టు 27.

27.08.2026 గురువారం రోజున తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ *రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి మరియు సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గార్ల ఆధ్వర్యంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల అసోసియేషన్లు మరియు ఆఫీస్ సబార్డినేట్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్క ఉద్యోగి ఆధ్వర్యం లో IDOC నస్పూర్ వద్ద మహాధర్నా* *నిర్వహించడం జరిగినది. ఈ మహా ధర్నాలో IDOC ముఖద్వారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి క్రింది సమస్యలపై *గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్* గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

ఈ మహాధర్నా లో TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు మరియు ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రధాన డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘాలన్నీ ఐక్యంగా కృషి చేయాలని తెలిపారు ప్రధానంగా క్రింది డిమాండ్ల పై చర్చిస్తూ మహ ధర్నాలో అందరు ఆమోదయోగ్యంతో ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు:

  1. 2వ PRCని తక్షణమే అమలు చేయాలి.
  2. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 6 విడతల DAలను వెంటనే విడుదల చేయాలి.
  3. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన EHS (Employees Health Scheme)ను సమర్థవంతంగా మరియు తక్షణమే అమలు చేయాలి.
  4. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయడానికి ప్రతి నెల రూ.2,000 కోట్లను విడుదల చేసి, ఉద్యోగుల బకాయిలను త్వరితగతిన చెల్లించాలి.
  5. ఉద్యోగుల CPs (Contributory Pension Scheme) సమస్యను పరిష్కరించి, ఉద్యోగులకు న్యాయం చేయాలి.
  6. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లకు తగిన గుర్తింపు (Recognition) కల్పించి, వాటి సమస్యలను అధికారికంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి.
    మన న్యాయమైన డిమాండ్లు ఉద్యోగుల ఆర్థిక, సామాజిక మరియు సేవా ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను తెలంగాణ ప్రభుత్వము తక్షణమే స్పందించి , వెంటనే చర్చలకు పిలిచి ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక మరియు పెన్షనర్ల సమస్యలు తక్షణ పరిష్కారం చూపాలని TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి తెలిపారు.
    TGEJAC మంచిర్యాల జిల్లా సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గారు మాట్లాడుతూ
    ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని లేనిచో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించడం జరిగినది. ఈ మహా ధర్నాలో
    అదనపు సెక్రటరీ జనరల్. కె. శంకర్ కో-చైర్మన్లు* జి. చక్రపాణి,
    శ్రీనివాస్ దేశ్‌పాండే, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు,
    బట్టారి వెంకటేశ్వర్లు, గుండేటి నాందేవ్,
    సుమిత్,
    పోడేటి సంజీవ్,పొలాస సత్యనారాయణ, ధరణికోట వేణుగోపాల్, పత్తి సత్తయ్య,
    బి. ప్రభాకర్,
    దుర్గ ప్రసాద్,
    బి. రామ్ మోహన్,
    కె.వి.ఎల్.ఎన్. మూర్తి,
    రాజేశ్వర్, ఎం.డి. అజర్, రాసపల్లి రవి, జి. రాజగోపాల్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ బొడ్డు శ్రావణ్ కుమార్, ఎ.సుధాకర్ వైస్ చైర్మన్లు బి. మోహన్, జి. రాజవేణు, ఓ. కృష్ణ, బి. మనోజ్, మోతె జయకృష్ణ, సూరినేని గంగాధర్, బన్న రవీందర్, ఎస్. కిషన్, బాలకృష్ణ, ఎ. సునీత, ఎన్. గోపాల్, బెజ్జంకి జగన్, ఏ రాజేందర్ రెడ్డి, మోషిన్ అహ్మద్ ,వెంకటరమణ, ఎం. రమేష్ ,రాథోడ్ రమేష్ ఫైనాన్స్ సెక్రటరీ అనుముల సతీష్ కుమార్ పబ్లిసిటీ సెక్రటరీ జె. రామ్‌ కుమార్ సెక్రటరీ లు నడిమెట్ల సత్యనారాయణ, తిరుపతి,మేడి శంకర్,
    గుండు వెంకటేశం,జి. వెంకటస్వామి, కే. శ్రీధర్ స్వామి మరియు టీజీవో,టీఎన్జీఓ, నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు నాయకులు మరియు జిల్లా లోని అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 4500 మంది పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!