ePaper
Friday, August 28, 2026
ePaper
Homeతెలంగాణఖమ్మంగిరి ప్రదక్షిణలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దంపతులు

గిరి ప్రదక్షిణలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దంపతులు

📰 Generate e-Paper Clip

గిరి ప్రదక్షిణలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దంపతులు

జగిత్యాల జిల్లా ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 28::

అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం, స్వామివారిని పల్లకిలో తీసుకువచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అంబారిపేట గ్రామ ప్రజలపై, జగిత్యాల నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఆలయాలను అభివృద్ధి చేసుకోవడం ఇతర మతాలను గౌరవించడం మనందరి బాధ్యత. భక్తుల సౌకర్యాల కోసం ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటాను అన్నారు.

ఈ గిరి ప్రదక్షిణలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని కోరుకున్నారు.…

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్,ఉప సర్పంచ్ గంగాధర్,ఆలయ చైర్మెన్ మల్లేశం, నాయకులు సమిండ్ల శ్రీనివాస్,బాల ముకుందం, చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి,మాజీ చైర్మెన్ నక్కల రవీందర్ రెడ్డి,నోముల శేఖర్ రెడ్డి, డైరెక్టర్ రాజి రెడ్డి,నారాయణ,గంగారెడ్డి,వెంకటేష్,చిరంజీవి,నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!