ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeతెలంగాణరక్షాబంధన్ వేడుకల్లో పాల్గోన్నబండారు దత్తాత్రేయ హైదరాబాద్

రక్షాబంధన్ వేడుకల్లో పాల్గోన్నబండారు దత్తాత్రేయ హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో  మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా  బండారు దత్తాత్రేయ  మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అన్నారు. మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం నెలకొనాలని అయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైదరాబాద్ నగర్ మాజీ మేయర్  బండారు కార్తిక రెడ్డి, బిజెపి మహిళా మోర్చా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్  ఉమా రమేష్ యాదవ్, బిజెపి జాతీయ నాయకురాలు అరుణ జ్యోతి, మంత్రి కళావతి మాజీ కార్పొరేటర్, భైరి అమరావతి, శోభా, మాధవి,  జ్యోతి మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొనడం జరిగింది.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!