అర్జున్ సమాచారం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో, శేషాచల అడవులలో ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహించడం తో పాటు, ఎర్ర చందనం కేసు లలో ముద్దాయిలు గా ఉంటూ తప్పించుకొని తిరుగుతున్న అంతర రాష్ట్ర స్మగ్లర్లను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ బృందం, స్టేట్ ఇంటేలిజెన్స్ బృందం కు మరియు అటవీ సిబ్బంది కి రాబడిన ఖచ్చితమైన సమాచారంతో చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, చిత్తపార ఫారెస్ట్ బీటు, పనాటురు సమీపమునగల చిత్తూరు – వేలూరు రోడ్డు నందు గల అండర్ బ్రిడ్జ్ సమీపమున వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా హ్యుండాయ్ కంపెనీకి చెందిన వెన్యూ వాహనము లో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ ఉండిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారి నుండి ఒక కారు, ఒక మోటార్ అపాచీ సైకిల్ తో సహా 07 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అడుపులోకి తీసుకున్న వారిలో పలు జిల్లాలలో 44 కి పైగా ఎర్ర చందనం కేసు లలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ ఉన్నాడు.
ఎం.. తంజి, వయస్సు 35 సంవత్సరాలు, S/o మణి వెస్ట్ కొల్లైమేడు గ్రామం, కిలరసంపట్టు, వెల్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం
కాగా అతనితో పాటు సెల్వం, వయసు 45 సం. తండ్రి. చిన్న కన్ను, ముట్నాటూరు గ్రామము. నాడానురు పోస్ట్, నమియంబట్టు పంచాయతి, జమునామత్తురు తాలుకా, తిరువన్నామలై జిల్లా, తమిళ నాడు రాష్ట్రం అను స్మగ్లర్ కూడా ఉన్నాడు.
వీరి నుంచి 07 ఎర్ర చందనం దొంగలు, ఒక కారు ఒక మోటార్ సైకిల్ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
పై తెలిపిన ముద్దాయిలు ఒక ముఠా గా ఏర్పడి ఎర్ర చందనం చెట్లు నరికించి వాటిని డంప్ గా చేసి ఎక్కువ మొత్తం లో డబ్బులకు బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన భడా ఎర్ర చందనం స్మగ్లర్లు కు అమ్ముకుందాం అని తమిళ కూలీల ద్వారా శేషాచలం అడవిలో ఎర్ర చందనం చెట్లు నరికించి వాటిని దుంగలు గా చేసి వాటిని వాహనం లో తరలిస్తూ ఉంటారు
వీరి ద్వారా బెంగుళూరు, చెన్నై లలోని ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసు విచారణ లో తంజి పైన చిత్తూర్, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో సుమారు 44 కి పైగా కేసులు నమోదు అయినట్లు, వాటిలో ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు తెలిసినది.
ఈ స్మగ్లింగ్ లో ఇతర ప్రధాన సూత్రధారులను గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కేసు లో ఎర్ర చందనం దొంగలు, వాహనం ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అంతర రాష్ట్ర స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు అభినందించడం తో పాటు వారికి రివార్డ్ లు ప్రకటించారు.
మున్ముందు కూడా ఎర్ర చందనం అక్రమ రవాణా నివారణ మరియు స్మగ్లింగ్ చేసే వారి పై కఠిన చర్యలు కొనసాగుతుంది
============================

