ePaper
Thursday, August 27, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్గంజాయి కేసులో నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపుదేవాపూర్ పోలీస్ స్టేషన్

గంజాయి కేసులో నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపుదేవాపూర్ పోలీస్ స్టేషన్

📰 Generate e-Paper Clip

గంజాయి కేసులో నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపుదేవాపూర్ పోలీస్ స్టేషన్

అర్జున్ సమాచారం ప్రతినిధి బెల్లంపల్లి ఆగస్టు 27.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్
పరిధిలో గంజాయి వినియోగం, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు బెల్లంపల్లి నివాసి ఎస్.కె. జమీర్ దేవాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాల ముందు అనుమానాస్పదంగా నల్లరంగు కవర్‌తో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న నల్లరంగు కవర్‌ను పోలీసులు తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అతని వద్ద నుండి 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితుడిని విచారించగా, తన పేరు ఎస్.కె. జమీర్, సన్ ఆఫ్ మహబూబ్, వయస్సు 30 సంవత్సరాలు, కులం: ముస్లిం, వృత్తి: కూలీ, నివాసం: బెల్లంపల్లి బస్తీ అని తెలిపాడు. అదేవిధంగా, తనకు తెలిసిన గంజాయి వినియోగదారులైన ఎ ఎ 2) ఎండి.యోనిస్, ఎ 3)చంటి, ఎ 4)బన్ని, ఎ 5)తాజ్ బాబా, ఎ 6)విష్ణు, ఎ 7)కిరణ్, ఎ 8)సమీర్, ఎ 9)అజయ్ వీరు బెల్లంపల్లి నివాసులు, గంజాయిని విక్రయించి డబ్బులు సంపాదించేవాడినని విచారణలో వెల్లడించాడు.ఈ మేరకు నిందితుడు ఏ1) ఎస్.కె. జమీర్పై ఎన్ డి పి ఎస్ ఏ సిటీ.లోని సెక్షన్ 8(సి) r/w 20(బి)(ii)(ఏ), 27(బి) కింద దేవాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే, మిగిలిన వ్యక్తులైన ఏ2 నుండి ఏ9 వరకు వారిపై . ఎన్ డి పి ఎస్ ఏ సిటీ.లోని సెక్షన్ 27(బి) కింద కేసు నమోదు చేశారు.తదుపరి చట్టపరమైన ప్రక్రియ అనంతరం నిందితుడు ఎస్.కె. జమీర్‌ను 27.08.2026న కోర్టులో హాజరుపరచి, లక్సెట్టిపేట జైలుకు రిమాండ్‌కు తరలించారు.ఈ సందర్భంగా దేవాపూర్ ఎస్‌ఐ ఎ. గంగారం మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా గంజాయి ఇతర మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడవద్దని సూచించారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు, కుటుంబాలపై మరియు సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ ఎ. గంగారం కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!