ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణరిటైర్డ్ కార్మికునికి ఘన సన్మానం38 ఏళ్లకుపైగా సింగరేణి సేవలకు అభినందనలు

రిటైర్డ్ కార్మికునికి ఘన సన్మానం38 ఏళ్లకుపైగా సింగరేణి సేవలకు అభినందనలు

📰 Generate e-Paper Clip

రిటైర్డ్ కార్మికునికి ఘన సన్మానం38 ఏళ్లకుపైగా సింగరేణి సేవలకు అభినందనలు

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 31:

సింగరేణి సంస్థలో 38 సంవత్సరాల ఐదు నెలల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన కార్మికుడు బొగధం మీడి రవీందర్‌ అరుణ్‌ను సుందరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కమాన్‌పూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుందరం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీటీసీ, లయన్స్‌ క్లబ్‌ కమాన్‌పూర్‌ ఉపాధ్యక్షుడు బోనాల వెంకటస్వామి అధ్యక్షత వహించారు.

ఓసీపీ–1 బేస్‌ వర్క్‌షాప్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో జనరల్‌ మజ్దూర్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన రవీందర్‌ అరుణ్‌ పదవీ విరమణ సందర్భంగా బోనాల వెంకటస్వామి ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి సంస్థకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ కార్యదర్శి చిప్పకుర్తి అరవింద్‌, సభ్యులు కుక్క హరిప్రసాద్‌, క్యాధాసి శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!