కాలువలో పడి యువకుడు దుర్మరణం
అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 4, ముత్తారం రిపోర్టర్:
ముత్తారం మండలంలోని కేసనపల్లి గ్రామ శివారులోని కాలువలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సాయిరాం (21) తన సమీప బంధువుల ఇంటికి హరిపురం గ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.
కాలువలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముత్తారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

