ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeతెలంగాణపదో తరగతి మెమోలో తప్పులున్నాయా? మీ సేవలో సరిచేసుకోండి

పదో తరగతి మెమోలో తప్పులున్నాయా? మీ సేవలో సరిచేసుకోండి

📰 Generate e-Paper Clip

పదో తరగతి మెమోలో తప్పులున్నాయా? మీ సేవలో సరిచేసుకోండి

మంచిర్యాల (అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 04):

పదో తరగతి మెమోలో పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులు ఉన్న విద్యార్థులకు శుభవార్త. మీ సేవ కేంద్రాల ద్వారా పదో తరగతి మెమో కరెక్షన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

విద్యార్థులు తమ పదో తరగతి మెమోలోని వివరాలను సరిచేసుకునేందుకు అవసరమైన పత్రాలతో మీ సేవ కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం సవరణ ప్రక్రియ చేపట్టనున్నారు.

పదో తరగతి మెమోలో తప్పులు ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ డిస్టిక్ మేనేజర్ గంప సునీల్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!