50 ఏళ్లుగా చొక్కా ధరించని జగిత్యాల వ్యక్తి, వదిలేసి వెళ్లిపోయిన భార్య
జగిత్యాల ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 6::
కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్య గత 50 ఏళ్లుగా చొక్కా ధరించడం లేదు. చిన్నప్పటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ జీవన శైలికి అలవాటు పడ్డ ఆయన, చొక్కా వేసుకుంటే తనకు అసౌకర్యంగా ఉంటుందని, చెమటలు పడతాయని తెలిపారు. ఈ అలవాటు వల్ల ఆయనను భార్య వదిలివెళ్లిపోగా, గ్రామస్థులు ఇతడిని ‘గాంధీ’ అని పిలుస్తుంటారు. ఈయన గతంలో వార్డు మెంబర్ చేసినా చొక్కా లేకుండానే సమావేశాలకు వెళ్లేవారు.

