ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeతెలంగాణఆనవాయితీగా మహిళల గాజుల సంబరాలు

ఆనవాయితీగా మహిళల గాజుల సంబరాలు

📰 Generate e-Paper Clip

ఆనవాయితీగా మహిళల గాజుల సంబరాలు

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 6 | ముత్తారం రిపోర్టర్

ముత్తారం మండల కేంద్రంలో మహిళల అక్కాచెల్లెళ్ల ఆడబిడ్డల గాజుల సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముత్తారం ఉపసర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్ మహిళా వార్డు సభ్యులకు, మహిళా మూర్తులకు గాజులు అందజేసి గాజుల వేడుకను ప్రారంభించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా వార్డు సభ్యులు మల్యాల లక్ష్మి, పింగిలి మౌనిక రెడ్డి, అనుము హేమలత, మల్యాల రమ, ఉదరి రమాదేవి, నల్లి లక్ష్మీప్రసన్న, అంగన్వాడీ టీచర్లు సత్యవతి, ధర్మలత, సుమతి, సుజాత, ఆశా వర్కర్లు సంధ్య, స్వప్న, వెలుగు సీఏ అనితతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయబద్ధంగా గాజులు వేసుకుని, పరస్పరం స్వీట్లు తినిపించుకుంటూ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!