జైపూర్ మండలం ఇందారం గ్రామంలో విచ్చలవిడిగా లారీల దొంగతనాలు
అర్జున సమాచారం చెన్నూర్ నియోజకవర్గం సెప్టెంబర్ 8).
లారీల్లోని బ్యాటరీలు, జాబులు, పానలు మాయం భయాందోళనలో యజమానులు గస్తీ పెంచాలని డిమాండ్
Lజైపూర్, సెప్టెంబర్ 8 జైపూర్ మండలం ఇందారం గ్రామంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గ్రామ శివారులో, రోడ్ల పక్కన నిలిపి ఉంచిన లారీలే లక్ష్యంగా దొంగల ముఠా రెచ్చిపోతోంది. లారీలలో అమర్చిన ఖరీదైన బ్యాటరీలు, జాబులు, పానలు సహా ఇతర విలువైన సామాగ్రిని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్తున్నారు
రాత్రి వేళల్లోనే చోరీలు
గ్రామస్తులు, లారీ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు లారీల వద్దకు చేరుకుంటున్నారు. బ్యాటరీ బాక్సులను పగలగొట్టి బ్యాటరీలను, టైర్ల మార్పిడికి వాడే జాబులను, ఇతర ఇనుప సామాగ్రిని దొంగిలిస్తున్నారు. ఒక్కో బ్యాటరీ విలువ వేల రూపాయలు ఉండటంతో బాధితులకు భారీ నష్టం వాటిల్లుతోంది
యజమానుల ఆవేదన
వరుస చోరీలతో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. “రాత్రి లారీ నిలిపితే ఉదయానికి బ్యాటరీ కనిపించడం లేదు. జాబులు, పానలు కూడా ఎత్తుకెళ్తున్నారు. ఇలా అయితే లారీలు నడపడం కష్టమవుతుంది” అని ఓ లారీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు
పోలీసులకు ఫిర్యాదు
ఇప్పటికే పలు లారీల్లో చోరీలు జరగడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో రాత్రిపూట పోలీసు గస్తీ ముమ్మరం చేయాలని, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నజరా పెట్టాలని వారు పోలీసు శాఖను కోరుతున్నారు.

