ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeతెలంగాణమచ్చుపేటలో నామకరణ మహోత్సవంలో చొప్పరి సదానందం

మచ్చుపేటలో నామకరణ మహోత్సవంలో చొప్పరి సదానందం

📰 Generate e-Paper Clip

మచ్చుపేటలో నామకరణ మహోత్సవంలో చొప్పరి సదానందం

అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 10 / ముత్తారం రిపోర్టర్

ముత్తారం మండలం మచ్చుపేట గ్రామ సర్పంచ్ చిలివేరి జ్యోతి–లక్ష్మణ్ దంపతుల కుమార్తె నామకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం ముదిరాజ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పెరిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!