న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12,అర్జున్ సమాచారం:
ప్రస్తుత సమయంలో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త, ప్రత్యామ్నాయ వేదిక అవసరం. దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్‌మాన్ ప్రకారం, 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ద్వారా భారత్‌కు తన గ్లోబల్ లీడర్‌షిప్ సామర్థ్యాన్ని మళ్లీ బలపరుచుకునే అవకాశం ఉంది. భారత్‌కు అతిపెద్ద సవాలు పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్తతలు, కొందరు సభ్యుల అమెరికా వ్యతిరేక వైఖరి మధ్య బ్యాలెన్సింగ్ సాధిస్తూ అందరినీ ఏకాభిప్రాయానికి ఒప్పించడం.. తద్వారా ఒక సంయుక్త ప్రకటనను చేయాలి.
గ్లోబల్ అస్థిరత కాలంలో విశ్వసనీయ పరిష్కారాలను భారత్ నిరంతరం అందిస్తోంది. నేడు అనిశ్చితి సమయంలో గ్లోబల్ సంస్థలు బలహీనపడుతున్న వేళ, భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు దృఢమైన, ప్రాయోగిక పరిష్కారాలను అందిస్తోంది. కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్ అనేక దేశాలకు వ్యాక్సిన్లు, ఆహార ధాన్యాలు, అత్యవసర వైద్య సహాయం అందించింది. నేడు భారత్ మిడిల్ ఈస్ట్ నుంచి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించగలదు. ఎందుకంటే అన్ని దేశాలతోనూ భారత్‌కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి.విదేశాంగ విధాన ప్రాధాన్యతలను అగ్రస్థానంలో ఉంచడం భారత్ తన దౌత్యానికి కేంద్రంగా చేసుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి, ప్రాధాన్యతలు, ఆకాంక్షలను భారత్ ప్రాముఖ్యంగా చూసింది. భారత్ తన జీ-20 అధ్యక్షత సమయంలో ఆఫ్రికన్ యూనియన్ (AU)ను శాశ్వత సభ్యుడిగా చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో గ్లోబల్ సౌత్‌కు ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ప్రాతినిధ్యం లభించింది. భారత్ మరోసారి అందరినీ కలుపుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది.విభిన్న, పరస్పర విరుద్ధ వైఖరులు కలిగిన దేశాల సమూహంలో ఏకాభిప్రాయం తీసుకురావడం భారత్ దౌత్య నైపుణ్యాన్ని స్పష్టం చేస్తుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సమయంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో రష్యా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు వంటి అంశాలపై విభజిత దేశాల మధ్య ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’ లేదా సంయుక్త ప్రకటనలపై ఏకాభిప్రాయం సాధించడం పెద్ద విజయం అవుతుంది. సంక్లిష్ట భౌగోళిక, రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏదో ఒక దేశానికి వంత పాడకుండా భారత్ అన్ని పక్షాలతో మధ్యస్తంగా ఉంటూ స్వతంత్రంగా పనిచేస్తోంది. ఒకవైపు అమెరికా, పాశ్చాత్య దేశాలతో సన్నిహిత వ్యూహాత్మక, రక్షణ సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. అదే సమయంలో బ్రిక్స్ వేదికపై రష్యా, ఇతర దేశాలతో ఇంధన, వాణిజ్య సహకారాన్ని కొనసాగించడం అద్భుతమైన వ్యూహంగా చెప్పవచ్చు.గ్లోబల్ సప్లై చైన్ అడ్డంకులను తొలగించేందుకు సురక్షిత, ప్రత్యామ్నాయ వాణిజ్య కారిడార్లను సిద్ధం చేయడంలో భారత్ కీలకపాత్ర పోషిస్తోంది. భారత్ మధ్యప్రాచ్యం- యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC) వంటి కార్యక్రమాల ద్వారా వాణిజ్య మార్గాలను బలోపేతం చేస్తూ, ఇతర దేశాలపై ఆధారపడే ప్రమాదాన్ని తగ్గించాలని భావిస్తోంది.సముద్ర మార్గాలు, కీలక జలసంధులను (హర్మూజ్ లాంటి) సురక్షిత మార్గాలుగా ఉంచి అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతి-ఎగుమతులను సజావుగా కొనసాగించాలని భారత్ భావిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళం ‘ఫస్ట్ రెస్పాండర్’ పాత్ర పోషించడం, ఎర్ర సముద్రం, హర్ముజ్ సమీపంలో వాణిజ్య నౌకలకు సముద్ర దొంగలు లేదా దాడుల నుంచి రక్షణ కల్పించడం ప్రశంసనీయం.భారత్ తన స్వదేశీ టెక్నాలజీ, డిజిటల్ మోడల్ (ఇండియా స్టాక్, UPI, డిజిలాకర్ వంటి)లను శ్రీలంక, కెన్యా వంటి ఆసియా, ఆఫ్రికా దేశాలతో పంచుకుంటోంది. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక సమగ్రతను పెంచడంతో పాటు, అవి అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతున్నాయి.యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC), ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి పాత గ్లోబల్ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తరచుగా నిర్లక్ష్యంగా ఉంటారు. ఈ సంస్థల్లో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి గ్లోబల్ సౌత్ దేశాలకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని బలంగా సమర్థిస్తూ, భారత్ నిజంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బలమైన గొంతుకగా మారుతోంది. బ్రిక్స్ వంటి వేదికలు పాశ్చాత్య- వ్యతిరేక సంస్థలుగా మారకుండా కేవలం వ్యూహాత్మక అభివృద్ధి, సౌత్- సౌత్ కోఆపరేషన్ పై ఫోకస్ చేయాలి. భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలున్నప్పటికీ పరస్పర వాణిజ్యం, స్థానిక కరెన్సీల్లో లావాదేవీలు (లోకల్ కరెన్సీ సెటిల్‌మెంట్), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కఠిన నిబంధనలు లేకుండా ఆర్థిక సహాయం అందించడంపై ఫోకస్ చేయాలిముఖ్యంగా ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఒకే బ్రిక్స్ వేదికలో ఉండటం ఈ చర్చలను మరింత క్లిష్టంగా మార్చింది. పశ్చిమాసియాలో యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దేశాల మధ్య ఉన్న విభేదాలను అధిగమించి ఏకాభిప్రాయం సాధించడం పెద్ద దౌత్య సవాలుగా మారింది.ఇరాన్, యూఏఈ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మేలో జరిగిన బ్రిక్స్ మంత్రివర్గ సమావేశం తొలిసారి సంయుక్త ప్రకటన లేకుండానే ముగిసింది. అప్పట్లో భారత్ ఛైర్ స్టేట్‌మెంట్, ఔట్‌కమ్ డాక్యుమెంట్‌ను మాత్రమే విడుదల చేసింది. ఈసారి మాత్రం సంయుక్త ప్రకటనకు సభ్య దేశాలు అంగీకరించాయి.ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ యుద్ధానికి బదులుగా చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని పదేపదే చెబుతోంది. జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో అనుసరించిన విధంగానే బ్రిక్స్‌లోనూ భారత్ గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళుతూ పశ్చిమ దేశాలకు వ్యతిరేక వేదికగా బ్రిక్స్‌ను మార్చకుండా బ్యాలెన్స్‌డ్ వైఖరిని కొనసాగిస్తోంది.బ్రిక్స్‌లో సభ్య దేశాల సంఖ్య పెరగడం ఏకాభిప్రాయ సాధనను మరింత కష్టతరం చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్, బ్రెజిల్ బ్రిక్స్‌ను ప్రధానంగా ఆర్థిక వేదికగా చూస్తుండగా.. చైనా, రష్యా దాన్ని భౌగోళిక రాజకీయ వేదికగా చూస్తున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.
==========================
సౌత్ లీడర్ గా భారత్
RELATED ARTICLES

