ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeస్పోర్ట్స్టెన్నిస్‌లో ప్రతిభ కనబరుస్తున్న యువ క్రీడాకారుడికి క్రీడా సామగ్రి అందజేత టెన్నిస్ రాకెట్,...

టెన్నిస్‌లో ప్రతిభ కనబరుస్తున్న యువ క్రీడాకారుడికి క్రీడా సామగ్రి అందజేత టెన్నిస్ రాకెట్, బ్యాగ్, బాల్స్ అందజేసిన స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

గుంటూరు,అర్జున్ సమాచారం:

టెన్నిస్ క్రీడలో ప్రతిభ కనబరుస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.కె. మొయిద్దీన్ భాష కుమారుడు షేక్ అఖియార్ అహ్మద్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈరోజు గుంటూరు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ టెన్నిస్ రాకెట్‌తో పాటు టెన్నిస్ బ్యాగ్, బాల్స్‌ను అందజేశారు.

వచ్చే నెల 11, 12 తేదీలలో కాకినాడ డీఎస్ఏ స్టేడియంలో జరగనున్న టెన్నిస్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న షేక్ అఖియార్ అహ్మద్‌ను ఈ సందర్భంగా అధికారులు అభినందించి, పోటీలలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ-2 ఎ. మల్లికార్జునరావుతో పాటు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొని యువ క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!