సింగరేణి గనుల నుంచి వెండితెర వైపు దమ్మాల శ్రీనివాస్..మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో కళకు పెద్దపీట.. ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం.
అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 17. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా: సింగరేణి కాలరీస్ సంస్థలో మూడు దశాబ్దాల పాటు విధులు నిర్వహిస్తూ కళారంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దమ్మాల శ్రీనివాస్, ఉద్యోగ విరమణ అనంతరం నటనలో మరో అడుగు ముందుకు వేస్తున్నారు.సింగరేణి సంస్థలో పనిచేసిన 30 ఏళ్ల కాలంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన నటనా ప్రతిభతో సహచర ఉద్యోగులను అలరించారు. కార్మికుల్లో చైతన్యం తీసుకురావడంలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రాధాన్యతను గుర్తించి పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.సింగరేణి పరిధిలోనే కాకుండా కోల్ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కళారంగంలోనూ ప్రతిభను చాటుకున్నారు.ఉద్యోగ విరమణతో కళా ప్రయాణాన్ని ఆపకుండా ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘బ్రహ్మముడి’ ధారావాహికలో నటిస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నారు. పలు వినోద కార్యక్రమాల్లోనూ నటిస్తూ తన ప్రతిభను విస్తరించుకుంటున్నారు.
సింగరేణి బొగ్గు గనుల్లో 30 ఏళ్ల సేవతో ప్రారంభమైన దమ్మాల శ్రీనివాస్ కళా ప్రయాణం ప్రస్తుతం బుల్లితెర నుంచి వెండితెర వైపు సాగుతోంది. ఉద్యోగ విరమణ తన వృత్తి జీవితానికి మాత్రమే ముగింపు పలికిందని, కళా ప్రయాణానికి కాదని ఆయన నిరూపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకొని వెండితెరపై మంచి నటుడిగా గుర్తింపు పొందాలని కళాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

