ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్నిమజ్జన మార్గంలో విద్యుత్‌ పోల్‌ అడ్డం మరో రెండు, మూడు రోజుల్లో నిమజ్జన ఊరేగింపులు.....

నిమజ్జన మార్గంలో విద్యుత్‌ పోల్‌ అడ్డం మరో రెండు, మూడు రోజుల్లో నిమజ్జన ఊరేగింపులు.. ప్రమాదం పొంచి ఉందంటున్న స్థానికులు

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌, అర్జున్ సమాచారం:
కరీంనగర్‌ కొత్తపల్లి (ఊర చెరువు) 17వ వార్డు పరిధిలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్న వేళ ప్రధాన రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్‌ పోల్‌ స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తపల్లి చెరువు బ్రిడ్జి సమీపంలో నిమజ్జన ఏర్పాట్లు చేపడుతున్న ప్రాంతానికి వెళ్లే మార్గంలో M/20 MCK 715 KTP 79 నంబర్‌ గల విద్యుత్‌ పోల్‌ రహదారికి అడ్డంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ మరియు జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్క అధికారి కూడా సందర్శించి చూడడం జరిగింది ఇట్టి చెరువును పరిశీలించిన . అధికారులు పరిశీలించినప్పటికీ ఎవరి దృష్టి కూడా .ఇట్టి పోలు పైన పడకపోవడం ఘమనార్ధం.
మరో రెండు, మూడు రోజుల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఇదే మార్గం ద్వారా భారీ సంఖ్యలో భక్తులు, వాహనాలు, వినాయక విగ్రహాలు తరలివెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్‌ పోల్‌ వల్ల ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..
విద్యుత్‌ పోల్‌ను తొలగించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నప్పటికీ, రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్‌ పోల్‌ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.
ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి.
నిమజ్జన ఊరేగింపులు ప్రారంభమయ్యేలోపే విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారికి అడ్డుగా ఉన్న విద్యుత్‌ పోల్‌ను తొలగించడం లేదా సురక్షితంగా పక్కకు మార్చడం ద్వారా నిమజ్జన మార్గాన్ని ప్రమాదరహితంగా సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!