ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిగర్రెపల్లి గ్రామం లొని ఎంపీపీ ఎస్ స్కూల్, విద్యార్థులకు షీ టీమ్ పోక్సో చట్టంపై అవగాహన

గర్రెపల్లి గ్రామం లొని ఎంపీపీ ఎస్ స్కూల్, విద్యార్థులకు షీ టీమ్ పోక్సో చట్టంపై అవగాహన

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:

రామగుండం సి. పి ఆదేశాల మేరకు, షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై లావణ్య  ఆధ్వర్యంలో పెద్దపెల్లి షీ టీమ్ వారు, సుల్తానాబాద్ మండలం, గర్రెపల్లి గ్రామం లొని ఎంపీపీ ఎస్ స్కూల్, విద్యార్థులకు షీ టీమ్  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది .అందులో భాగంగా షీ టీమ్ మెంబర్ స్నేహలత  మాట్లాడుతూ, గుడ్ టచ్ బాడ్ టచ్, గురించి విద్యార్థులు తెలియని వారి పట్ల ఎలా ఉండాలి, పోక్సో యాక్ట్ గురించి, సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా ఉంది, విద్యార్థుల ప్రవర్తన నియామవాలి గురించి తెలిపారు మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్ గురించి తెలిపారు ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిఘా  ఉంటుందని , ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు  ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు , అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100/112 నంబర్ కు డయల్ చేయాలని, అలాగే అన్లైన్ మోసాలకు గురైతే 1930 కి ఫోన్ చేయాలనీ, మహిళలకు ప్రయాణ సమయం లొ ట్రావెలింగ్ సేఫ్టీ అప్ టి- సేఫ్ ఆప్ వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమం లొ హెడ్ మాస్టర్ అశోక్  , ఉపాధ్యాయులు మరియు షీ టీమ్ సభ్యులు, మౌనిక పాల్గొన్నారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!