ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeతెలంగాణజిల్లా స్థాయి ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు విశేష స్పందన ,అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో...

జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు విశేష స్పందన ,అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభకు పరీక్ష.

📰 Generate e-Paper Clip

జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు విశేష స్పందన ,అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభకు పరీక్ష.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులు కృషి చేయాలి…

అర్జున్ సమాచారం . నవంబర్ 14 .రామగిరి రిపోర్టర్.

మంథని, నవంబర్ 14: పెద్దపల్లి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్-14, అండర్-17 బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. శనివారం మంథనిలోని జేఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, పేటా సంఘం రాష్ట్ర బాధ్యులు కొమురోజు శ్రీనివాస్, విజయ్ కుమారులతో కలిసి ఉదయం 9 గంటలకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ….పెద్దపల్లి జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ ఉందని తెలిపారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత తరం క్రీడాకారులు కూడా క్రమశిక్షణతో నిరంతరం సాధన చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

క్రీడలను కేవలం వ్యాయామం, వినోదంగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించే వృత్తిపరమైన రంగంగా కూడా ఎంచుకోవాలని సూచించారు. ప్రతిభతో పాటు పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించవచ్చని పేర్కొన్నారు.

మంథనిలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్మించిన ఆధునిక ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఇలాంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు.

జిల్లా స్థాయి ఎంపిక పోటీలు విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు ఉన్నత స్థాయి పోటీలకు వెళ్లేందుకు మంచి వేదికగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు జావిద్, ఖాజాబీ, వెంకటేష్, సతీష్, సరోజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!