చెన్నూరు, అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 24.:
బన్సీదర్, కౌసల్య భాయ్ లాహోటి గార్ల స్మారకార్థం చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 38 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. కరీంనగర్ రేకుర్తిలోని ఉదార నేత్ర వైద్యశాల సౌజన్యంతో, లయన్స్ క్లబ్ వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో ఈ శిబిరాన్ని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు.
కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న 38 మంది గురువారం చెన్నూరుకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ నిమ్మల సాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆపరేషన్లు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కంటి ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. రేకుర్తి ఆసుపత్రి వైద్యులు సూచించిన విధంగా కంటి చుక్కల మందులను క్రమం తప్పకుండా ఉపయోగించాలని, అక్టోబర్ 2న తప్పనిసరిగా రేకుర్తి నేత్ర వైద్యశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమలాంటి నిరుపేదలకు ఉచితంగా కంటి వైద్యం, ఆపరేషన్లు అందించిన రేకుర్తి నేత్ర వైద్యశాల యాజమాన్యం, వైద్యులు, చెన్నూరు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ చైర్‌పర్సన్ లయన్ జాడి తిరుపతి, 320జి జిల్లా క్యాబినెట్ సభ్యుడు లయన్ మోదంపురం వెంకటేశ్వర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సభ్యుడు లయన్ కర్రె లచ్చన్న (న్యాయవాది), ప్రధాన కార్యదర్శి లయన్ కప్స ప్రతాప్ సింగ్, లయన్ బొల్లంపల్లి నాగరాజా గౌడ్, లయన్ నిమ్మల విశాల, లయన్ మద్ది కార్తీక్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

