ePaper
Monday, September 28, 2026
ePaper
Homeతెలంగాణభూసేకరణలో దళారుల చేతిలో మోసపోవద్దు.ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామంటూ మోసం చేసే మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

భూసేకరణలో దళారుల చేతిలో మోసపోవద్దు.ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామంటూ మోసం చేసే మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

📰 Generate e-Paper Clip

భూసేకరణలో దళారుల చేతిలో మోసపోవద్దు.ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామంటూ మోసం చేసే మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పెద్దపల్లి: రామగిరి,అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 25.

భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న బాధితులు దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని నేరుగా బాధితులకే అందజేస్తామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారులు, రైల్వే మార్గాల విస్తరణకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు, మధ్యవర్తులు ప్రజలను నమ్మించి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

భూములు కోల్పోతున్న బాధితులు ఇలాంటి వ్యక్తుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అందాల్సిన నష్టపరిహారాన్ని సంబంధిత అధికారులు నేరుగా బాధితులకు తెలియజేసి చెల్లిస్తారని స్పష్టం చేశారు.

సింగరేణి, పరిశ్రమలు, జాతీయ రహదారులు, రైల్వే భూసేకరణకు సంబంధించి ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు డిమాండ్ చేసినా లేదా మోసపూరితంగా వ్యవహరించినా వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. అనధికార వ్యక్తులను నమ్మి ప్రజలు ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!