ePaper
Monday, September 28, 2026
ePaper
Homeతెలంగాణఅంగన్వాడీ చిన్నారులకు పీసీఆర్ ఫౌండేషన్ అండ .కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం.

అంగన్వాడీ చిన్నారులకు పీసీఆర్ ఫౌండేషన్ అండ .కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

అంగన్వాడీ చిన్నారులకు పీసీఆర్ ఫౌండేషన్ అండ .కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం.
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్25:

జన్నారం: మండలంలోని కిష్టాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా 50 పలకలను అంగన్వాడీ టీచర్ స్వరూప గారికి అందజేశారు.

చిన్నారుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి ప్రాథమిక విద్యకు అవసరమైన సామగ్రిని అందించేందుకు పీసీఆర్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ సర్పంచ్ వాసాల నరేష్ గారు, పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ గారు, ఫౌండేషన్ సభ్యులు నోముల రాజ్ కుమార్, కొత్త శ్రీనివాస్, కానగంటి దేవయ్య, సాయి కిరణ్, ఇప్ప మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే అంగన్వాడీ సూపర్‌వైజర్ పి. వాణి గారు, MPPS ఉపాధ్యాయులు సుధాకర్ నాయక్ గారు, కిష్టాపూర్ గ్రామ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు స్వరూప గారు, వనిత గారు, యశోద గారు పాల్గొన్నారు.

చిన్నారుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ పీసీఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!