అర్జున్ సమాచారం:
తిరుమల శ్రీవారిని సింగపూర్ మంత్రి షణ్ముగం దర్శించుకున్నారు. సింగపూర్ మంత్రి వెంట ఏపీ మంత్రి నారా లోకేశ్ ఉన్నారు. షణ్ముగంతో కలిసి నారా లోకేశ్ సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవల్లో పాల్గొన్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేయగా…ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందచేశారు.
సింగపూర్ మంత్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్నా: మంత్రి లోకేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ మంత్రి షణ్ముగం, మంత్రి లోకేశ్‌లు దర్శంచుకున్నారు. సుప్రభాత, తోమాల, అర్చన సేవల్లో పాల్గొన్న షణ్ముగం, లోకేశ్.. మూలవిరాట్టును దర్శించుకొని సింగపూర్ మంత్రి షణ్ముగం మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసిన ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాను. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు’అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు.

